చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా చేయడానికి కారణం ఎవరో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఇక  తాజాగా చిరు నటించిన సినిమా గాడ్ ఫాదర్' .ఇదిలావుంటే ఇక ఆయన ఈ సందర్భంగా ఈ సినిమా చేయడానికి ప్రధానమైన కారణం ఎవరు అన్న విషయాన్ని చెప్పారు. అయితే చిరు మాట్లాడుతూ...ఈ సినిమా చేయడానికి  రామ్ చరణ్ అని చిరంజీవి తెలియజేశారు.అయితే  చరణ్ 'లూసిఫర్' సినిమా చూసి డాడీ ఇది మీ ఇమేజ్ కి ఈ టైంలో సరిగ్గా సూట్ అయ్యే సబ్జెక్ట్.

చరణ్ కోరిక మేరకు “గాడ్ ఫాదర్” గా రూపాంతరం చెందింది.ఇక  ఇందుకుగాను చరణ్ కి కృతజ్ఞతలు. తర్వాత సబ్జెక్టు ఓకే చేశాక… దర్శకుడిగా ఎవరు ఉంటే బాగుంటుంది..? అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి కూడా చరణ్.. మోహన్ రాజా అయితే కరెక్ట్ అని సలహా ఇచ్చారు.ఇక ధ్రువతో అద్భుతమైన విజయం అందించడం జరిగింది.అంతేకాదు కచ్చితంగా మోహన్ రాజా ఈ సబ్జెక్టుకి న్యాయం చేయగలడు అని చరణ్ అన్నాడు. దీంతో నేను కూడా మోహన్ రాజా ఖచ్చితంగా యంగ్ బ్లడ్ కలిగిన దర్శకుడు కావడంతో.. నమ్మకంతో ఓకే చెప్పినట్లు చిరంజీవి తెలిపారు.

ఇక ”గాడ్ ఫాదర్” సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాదు మీరు నేను చూసి గర్వపడతామని చిరంజీవి తెలిపారు. అయితే దాదాపు సంవత్సరం పైగా ఈ సినిమాపై మోహన్ రాజా టీంతో పాటు సత్యానంద్ అందరం కలిసి వర్క్ చేసాం. ఇక మీ అందరికీ నచ్చే రీతిలో ఆమోదయోగ్యం పొందేలా స్క్రిప్ట్ రెడీ అయింది.అంతేకాదు  ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నీ తీసుకోవటం జరిగింది.ఈ  కథ వినకుండానే సల్లు బాయ్ ఓకే చేశారు.ఇక ఈ రీతిగా సినిమా ఓకే చేయటానికి దర్శకుడిగా మోహన్ రాజానీ తీసుకోవడానికి.. సల్మాన్ ఖాన్.. ఒప్పించడానికి చరణ్ ప్రధాన కారణం. మెగా పవర్ స్టార్  చరణ్ చొరవతోనే “గాడ్ ఫాదర్” సినిమా చేసినట్లు చిరంజీవి తెలియజేశారు. కాగా అక్టోబర్ 5వ తారీఖు దసరా పండుగ నేపథ్యంలో.. “గాడ్ ఫాదర్” రిలీజ్ కానుంది.అయితే  ఈ సినిమాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిన్న గెస్ట్ రోల్ చేయడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: