RRR సినిమాకు ఎందుకు ఆస్కార్ అవార్డు రాలేదో తెలుసా..?
ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డుల గురించి పెద్ద చర్చ జరుగుతోందని చెప్పవచ్చు. ఆస్కార్ అవార్డు కు ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అవుతున్న చిత్రాల చుట్టూ పలు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఇ ఏడాది డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు సినీ ప్రేక్షకులు. ఈ సినిమా లో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా రూ.1200 కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇ దీంతో ఏడాది ఆస్కార్ బరిలో నిలుస్తుందనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆస్కార్ నామినేషన్ కి ఎందుకు వెళ్లలేకపోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆస్కార్ అవార్డు రావాలి అంటే సినిమాలో పలు అంశాలు ఉండాలి. ముఖ్యంగా అందరూ మనకు నచ్చిన సినిమాలు కాకుండా ఏవో ఒక పేరు తెలియని సినిమాలు నామినేట్ అవుతున్నాయి ఏంటి అని అందరిలో సందేహాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. బాగా పాపులర్ అయిన సినిమాకి అవార్డు రాలేదని వాదన చేసే ముందు పలు ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకోవాలి.
RRR సినిమా ఈ మధ్యకాలంలో విడుదలైన వాటిలో గొప్ప సినిమా అని చెప్పవచ్చు. అయితే ఒక సినిమా ఆస్కార్ అవార్డు సాధిస్తే ఆ సినిమా చిత్ర బంధమే కాదు దేశమంతా గర్విస్తుంది. అయితే అలాంటివి రావాలి అంటే గొప్ప గొప్ప విజయాలు వెనక చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఆస్కార్ అవార్డు ఎంపిక చేసే వాటిలో FFI కమిటీ అందుకు బాధ్యత వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేషన్ కి వెళ్లి అవకాశం ఉంది.. ఆస్కార్ అవార్డు కావాలి అంటే కచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతోనే కాకుండా కేవలం నాచురల్ గా ఉండాలి ఎక్కువ గ్రాఫిక్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఆ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా తనలోని భావన ఇదే అనేలా కలిగి ఉండాలని సమాచారం. ఇంకా మరెన్నో అంశాలు కూడా ఉన్నాయి.