మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్..70 వేల మందికి..

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ లోకానికి డార్లింగ్ ప్రభాస్ పేరు తెలుసు.. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..ఆ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏవి కూడా అతనికి అనుకున్న పేరును అందించలేక పోయాయి.. ఇప్పుడు ఏకంగా బాలివుడ్ లోనే సినిమాలు చేస్తున్నారు..

ఇక విషయానికొస్తే.. ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బాహుబలి పెట్టే భోజనం ఎలా ఉంటుందో ఇది వరకు ఎన్నో సార్లు ఎంతో మంది చెప్పారు. బాలీవుడ్ స్టార్లు అయితే బాహుబలి భోజనాని కి ఫిదా అవుతుంటారు. ప్రభాస్ ప్రేమతో ఇలా అన్నం పెట్టి మమ్మల్ని చంపేస్తాడంటూ సరదాగా చెబుతుంటారు. అలా ప్రభాస్ భోజనాలు పంపిస్తుంటే.. మా డైట్ ఏం కావాలన్నట్టుగా చమత్కరిస్తుంటారు. ఇక సెట్‌లో అందరి కోసం స్పెషల్‌ గా ప్రిపేర్ చేయించి తీసుకొస్తుంటాడు..

ఆ ఫ్యామిలీకి ఆతిథ్యం పట్ల అంత మక్కువ ఉంటుంది. గత వారం కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయం లోనూ కడసారి చూసేందుకు వచ్చిన వారి గురించి ప్రభాస్ ఫ్యామిలీ ఆలోచించింది. వచ్చిన వారందరికీ భోజనం పెట్టించి మరీ పంపించింది. అయితే ఇప్పుడు భీమవరం లోని మొగల్తూరు లో కృష్ణంరాజు స్మారక సభను ఏర్పాటు చేస్తున్నారు.. ఈ నెల 29 న ప్రభాస్ తన సొంతూరు భీమవరాని కి చేరుకోనున్నాడు. ఇక కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయించాలని ప్రభాస్ ఫ్యామిలీ నిర్ణయించుకున్నారట. ఈ విషయం ఇప్పడు నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..ఎంతైనా ప్రభాస్ ఆలోచనలు భారీగానే ఉంటాయని ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం ప్రభాస్ తెలుగు,హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: