టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర
హీరోయిన్ గా ఉన్న
రష్మిక మందన ఇప్పుడు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలతో తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మంచి క్రేజ్ అందుకొని పెద్ద హీరోల సరసన కూడా నటించడం మొదలు పెట్టింది. ఆ విధంగా తెలుగులో భారీ స్థాయిలో విజయాలను అందుకున్న ఈమె ఇప్పుడు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో సినిమాలు చేస్తూ ఉండడం ఆమె అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది.
అయితే
రష్మిక తెలుగు సినిమాలను కాదనుకొని మరి అక్కడే సినిమాలు చేయడానికి సిద్ధం అవుతూ ఉండడం వారిని కొంత నిరాశ పరుస్తుంది కూడా. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క తెలుగు
సినిమా మాత్రమే ఉంది. అది కూడా ఆమె గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతుంది. పుష్ప
సినిమా విజయం సాధించడంలో
రష్మిక మందన పాత్ర చాలానే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప రెండో భాగం సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది. దీని తర్వాత తెలుగులో ఆమె ఇప్పటిదాకా ఒక్క
సినిమా కూడా నటించలేదు అంటే
టాలీవుడ్ సినిమాలలో నటించాలని అనుకుంటుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.
పోనీ
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆయన ఆమె పెద్ద సినిమాలలో నటిస్తుందా అంటే అది కూడా కాదు మొన్నటి దాకా
చిన్నా చితక హీరోల సరసన నటిస్తూ ముందుకు నెట్టుకు వచ్చిన
రష్మిక మందాన యానిమల్ అనే సినిమాను కూడా చేస్తుంది. ఈమె కెరియర్ లో చెప్పుకోదగ్గ
బాలీవుడ్ సినిమా అంటే ఇదే అని చెప్పవచ్చు. రణభీర్ కపూర్ నటిస్తున్న ఈ
సినిమా తర్వాత ఆమె ఏ
బాలీవుడ్ సినిమా కూడా సైన్ చేయలేదు. తెలుగులో కూడా పెద్ద
హీరో సరసన సైన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడ సినిమాలు చేయాలనుకుంటుందో ముందుగా దానిపై క్లారిటీ తెచ్చుకొని అక్కడే సినిమాలు చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిమానుల సలహా.. దానిని ఆమె పాటిస్తుందా అనేది చూడాలి.