సహాయం కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోయిన్..!!

frame సహాయం కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోయిన్..!!

Divya
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారి గురించి కొన్నిసార్లు వారు పడుతున్న బాధలు గురించి తెలుసుకుంటే మనసు చాలా తల్లడిల్లి పోతుందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్ని వందల చిత్రాలలో నటించినా ప్రముఖ నటి.. తన వయసు ఎక్కువగా ఉండడంతో ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోడ్డున పడినట్లుగా తెలుస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో దశాబ్దం పాటు అలరించిన అలనాటి హీరోయిన్ జయ కుమారి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. స్టార్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు నటించి ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి బాగాలేక వైద్యం కోసం ఎదురుచూపులు చూస్తోంది అన్నట్లుగా తెలుస్తోంది.
కేవలం ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ ,కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. దీంతో ఈ విషయం తెలిసిన నేటిజన్లు సైతం ఇమేకి ఎవరైనా ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈమె స్టార్ హీరోలైనా ఎన్టీఆర్, ఎంజీఆర్,దిలీప్ కుమార్ తదితర హీరోలతో 400 సినిమాలకు పైగా నటించిన ఘనత దక్కించుకుంది. అయితే కెరియర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడే ఈమే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది జయ కుమారి. ఇక ఈమె ఇద్దరు కుమార్తెలు కూడా ఇటీవలే మరణించారు. ఇక తన భర్త కూడా ఆర్థిక సమస్యలతోనే కొద్దిరోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది.


ఇప్పుడు జయకుమార్ పరిస్థితి కూడా సరిగ్గా లేదని ఆమె రెండు కిడ్నీలు కూడా పూర్తిగా పాడయ్యాయని వైద్యులు తెలియజేసినట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నారు. ఇక జయకు వారి కుమారులు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. జీవనం కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. ఇక చెన్నైలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈమె చికిత్స తీసుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు సహాయం అందిస్తారని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: