దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావాలని ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తే మాత్రమే చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఈ సినిమా కోసం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.అయితే వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తారక్, చరణ్ లకు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో రాజమౌళికి అవార్డ్ వచ్చే అవకాశం ఉందంటూ అంచనా వేస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.
ఇక గతంలో ఆస్కార్ అవార్డ్ లు అందుకున్న సినిమాలు సైతం ప్రచారం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేశాయని తెలుస్తోంది. అయితే ఇక ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి జక్కన్న టీం ఆసక్తి చూపుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కాగా నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రపంచ దేశాల ప్రజలు ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఆస్కార్ అవార్డ్స్ కు ఆర్ఆర్ఆర్ నామినేషన్ పొందితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.
ఇక ఆర్ఆర్ఆర్ మరెన్నో సంచలనాలను సృష్టించాలని ఈ సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో 1135 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించడంతో పాటు చరణ్, తారక్ లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా చరణ్, తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.ఇక ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ ఈ ఇద్దరు హీరోల కెరీర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ అయింది..!!