టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.అయితే తాజాగా ఈయన నటించిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి .అయితే ఇక సినిమాకి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ...తన మనసులో మాట బయటపెట్టాడు ఈ యంగ్ హీరో . అయితే తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉందనే విషయాన్ని వెల్లడించాడు.ఇక ఆయన నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హీరో, ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తానంటున్నాడు.
అంతేకాదు ఆయన మాట్లాడుతూ..."నేను చాలా మంది కొత్త దర్శకులతో పని చేశాను. నాకు తెలియకుండానే దర్శకులు చేసే కొన్ని పనులు చేశాను. అంతేకాదు తప్పని పరిస్థితుల మధ్య ఏవో సీన్స్, డైలాగ్స్ రాయడం, షూటింగ్ చూసుకోవడం వంటి పనులు చేశాను. ఇక దీంతో నాకు తెలియకుండానే, అనుకోకుండా దర్శకత్వం వైపు ఆసక్తి ఏర్పడింది. అయితే ఇక దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలీదు. ఏదేమైన ఇప్పటికైతే నా ఫోకస్ మొత్తం నటనపైనే ఉంది."ఇక ఇలా తన దర్శకత్వపు ఆలోచనల్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. అయితే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో దర్శకుడిగా కనిపిస్తాడు సుధీర్ బాబు.
ఇక ఆ సినిమాలో డైరక్టర్ పాత్ర పోషించడం తనకు పెద్దగా కష్టం అనిపించలేదంటున్నాడు ఈ నటుడు.ఇకపోతే "ఇంద్రగంటి గారి సినిమాల్లో ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ ఆ పాత్రలతో ప్రయాణిస్తారు.ఇక ఇందులో కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. అంతేకాదు ఆ పాత్రకి కొంచెం తిక్క, భిన్నమైన అభిరుచి ఉంటుంది. ఇకపోతే కమర్షియల్ సినిమాను కూడా గొప్ప పర్పస్ కోసం తీస్తామని ఇందులో చెప్పడం జరిగింది.ఇక ఇంద్రగంటి గారు ఈ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు.అయితే నాకైతే నటించడానికి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు."ఇక కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు.కాగా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఇదిలావుంటే ఇక రిజల్ట్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది..!!