హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో ఫారియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దు గుమ్మ జాతి రత్నాలు మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో చిట్టి పాత్రలో నటించిన ఫారియా అబ్దుల్లా తన నటన తో నవ్వులను పూయించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ కూడా లభించింది.
ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ లో ఫారియా అబ్దుల్లా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తిరగేకుతున్న రవణాసుర మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ పొడుగు కాళ్ళ సుందరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఎక్కువగా ఫరియా అబ్దుల్లా తను డాన్స్ చేస్తున్న వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ అప్పు డప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఫారియా అబ్దుల్లా తన ఇన్ స్టా లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లలో ఉన్న డ్రెస్ ను వేసుకొని పింక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ని వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.