ప్చ్.. బేబమ్మ కి ఇది రాంగ్ చాయిస్!!

P.Nishanth Kumar
ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఇప్పుడు తాను ఎంపిక చేసుకున్న సినిమాల పట్ల ఆమె అభిమానులు కొంత కలవరాన్ని గురి చేస్తున్నారు. తొలి మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫ్లాప్ లి అందుకోవడం వారిని ఎంతగానో కలవరపెడుతూ ఉండగా సినిమాలు విజయాలు సాధించాలని చెప్పి ఆమె ఎంచుకుంటున్న పాత్రలను చూసి వారు మరింత కలవర పడుతున్నారని చెప్పాలి.


 తెలుగు సినిమా పరిశ్రమంలో ఎక్కువగా గ్లామర్ హీరోయిన్లకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి హీరోయిన్లను ఎక్కువగా తమ సినిమాలలో పెట్టుకునేందుకు పెద్ద హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది హీరోయిన్లు క్యారెక్టర్ బాగా ఉండాలని చెప్పి పరిమితమైన పాత్రలకు ప్రాధాన్యాత ఇస్తూ ఉండడం వారి కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు అని చెప్పాలి. ఆ విధంగా కృతి ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ గా కాకుండా ఒక రకమైన పాత్రలో నటించడానికి సిద్ధమవుతుంది.

అక్కినేని నాగచైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈమె ఓ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రాబోతున్న ఈ చిత్రంలో ఈమె ఒక దెయ్యం పాత్రలో నటించబోతుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వెరైటీ సినిమాలను చేసే దర్శకుడైన వెంకట్ ప్రభు ఈమె పాత్రను బాగానే తీర్చిదిద్దిన కూడా ఈ పాత్రకు ఈమె సరైన ఎంపిక చేయడం సరైనది కాదు అన్నది కొంతమంది సినిమా విశ్లేషకులు అభిప్రాయం. మరి గ్లామర్ కథానాయకగా మంచి గుర్తింపు ఉన్న కృతి శెట్టికి ఈ పాత్ర ఏ విధంగా సెట్ అవుతుంది అనేది చూడాలి. ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన వరుస చిత్రాలు ఫ్లాప్ కావడంతో గ్లామర్ కథానాయకగా ఆమె పెద్ద హీరోయిన్ గా ఎదగాలి అంటే అలాంటి పాత్రలు ఎంచుకోవాలి అనేది ఆమె అభిమానులు చెబుతున్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: