భారీ ధరకు అమ్ముడుపోయిన పోన్నియన్ సెల్వన్ 'ఓటిటి' హక్కులు..?

Pulgam Srinivas
గ్రేట్ దర్శకుడు మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.


ఈ ప్రచార చిత్రాలు అదిరి పోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో హేమా హేమీ నటి నటులు అయినటు వంటి చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష నటిస్తున్నారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ 'ఓ టి టి' మరియు సాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.


అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 125 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ డిజిటల్ హక్కులకు  సన్ టీవీ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీ పై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: