ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'పొన్నియన్ సెల్వన్' సినిమా ఒకటి. ఇక లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలుంటాయి.అయితే ప్రేమకథా చిత్రాలకే మణిరత్నం టేకింగ్ గాని, డీటేయిలింగ్ గాని ఒక రేంజ్‌లో ఉంటాయి.ఇక అలాంటిది ఈ సారి ఏకంగా పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడంటే ఇంకా ఏ స్థాయిలో తన టేకింగ్ ఉండనుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఇకపోతే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అందాల తార ఐశ్వర్యరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేస్తుందట. కాగా అందులో ఒక పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉండనుందట. అయితే ఆ పాత్రే 'పొన్నియన్ సెల్వన్ లో కీ రోల్ ప్లే చేస్తోందట. కోలీవుడ్‌కు ఐశ్వర్యరాయ్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసిన మణిరత్నం, ఈ సారి విలన్‌గా పరిచయం చేస్తున్నాడు.ఇక ఐశ్వర్యరాయ్ గతంలో ఖాకీ సినిమాలో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పిచ్చింది.
ఇకపోతే పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని ప్రముఖ రైటర్ కల్కీ కృష్ణమూర్తీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం రెండు భాగాలుగా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించాడు. అయితే మొదటి భాగం సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు..!!