త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ లో క్రిష్ ముందడుగు !

Seetha Sailaja
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల సాన్నిహిత్యం మాటలకందనిది. పవన్ ఖాళీగా ఉన్నాడు అంటే చాలు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి తన దగ్గరకు పిలిపించుకుని రాజకీయాల నుండి సాహిత్యం వరకు ఎన్నో విషయాలు గంటల తరబడి చర్చించుకుంటూ ఉంటారు అని పవన్ సన్నిహితులు చెపుతూ ఉంటారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథ చెపితే ఆకథ తనకు సరిపోతుందా లేదా అన్న విషయం కూడ ఆలోచించకుండా పవన్ త్రివిక్రమ్ సూచించిన మూవీ ప్రాజెక్ట్ లో నటిస్తాడు అన్నది ఇండస్ట్రీ వర్గాలు ఓపెన్ గానే చెప్పే విషయం. ‘భీమ్లా నాయక్’ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒత్తిడితో పవన్ ఒప్పుకున్నాడు అని అంటారు. ఇప్పుడు పవన్ నటించడానికి అంగీకరించిన ‘వినోదసితం’ రీమేక్ విషయంలో త్రివిక్రమ్ ఒత్తిడి ఉంది అంటారు.

వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉంది. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ కు డైలాగ్స్ వ్రాస్తున్న బుర్రా సాయి మాధవ్ ఆలస్యం చేయడంతో పాటు పవన్ రాజకీయ కార్యకలాపాలు వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయింది అంటారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఇప్పుడు ‘వినోదసితం’ రీమేక్ షూటింగ్ వాయిదా పడింది అంటున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ క్రిష్ ను పిలిపించుకుని ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ వెంటనే ప్రారంభించమని అమూవీకి సంబంధించి తన వర్క్ ను పూర్తి చేసుకుని ఆతరువాత ‘వినోదసితం’ మూవీ షూటింగ్ వైపు వెళతానని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ఎప్పటి నుండో పవన్ డేట్స్ గురించి ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్న క్రిష్ మళ్ళీ పవన్ కు మూడ్ మారకుండా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ను ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా షూట్ పూర్తిచేసి తాను గట్టెక్కాలని క్రిష్ ఆశపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: