రకుల్ ని అస్సలు వదలనంటున్నఅజయ్ దేవగన్..!!
ఆమె ఉన్నట్టుండి బాలీవుడ్ లో ఎలా బిజీ అవ్వగలుగుతుంది ? స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆమెకు ఎందుకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు ? అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రకుల్ కి వచ్చిన ఆ ఆఫర్ల గోల ఏమిటంటే.. రకుల్‌ని హీరో అజయ్ దేవగన్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదట.. అజయ్‌తో రకుల్ చేసిన దే దే ప్యార్ బ్లాక్ బస్టర్ అవడంతో రకుల్‌ని సెంటిమెంట్‌గా భావించిన అజయ్, తన ప్రతీ సినిమాలోనూ రకుల్ ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నాడట..
రన్‌వే 34 తో పాటుగా తాజాగా మరో సినిమా కోసం కూడా రకుల్‌ని రిఫర్ చేశాడట అజయ్. అంటే, అజయ్ దేవగన్ తో ఆమెకిది వరుసగా నాలుగో సినిమా అన్నమాట. మూడేళ్లలో ఓ బాలీవుడ్ అగ్ర హీరో సరసన ఇలా నాలుగు సినిమాలు చేయడం అంటే.. మహామహా హీరోయిన్లకే సాధ్యం కాలేదని తెలుస్తుంది... మరి రకుల్ కి ఎలా సాధ్యం అయింది అనేది బాలీవుడ్ జనం అనుమానాలు.
నిజానికి రకుల్ హీరోలను మెప్పించడంలో మొదటినుండి ముందంజలోనే ఉంది. విషయం ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా ఆఫర్స్ అందుకోలేకపోతున్న రోజుల్లో కూడా.. ఒక్క 'రకుల్ ప్రీత్ సింగ్' మాత్రమే జస్ట్ నాలుగేళ్లల్లోనే ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ లాంటి అందరీ స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేసిందట.. పైగా గత ఏడాది వరకూ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో రకుల్ పేరు ప్రముఖంగా వినిపించేది.
దీనిబట్టి, స్టార్ హీరోలను పట్టడంలో రకుల్ మహా దిట్ట అని తెలుస్తుంది.. ఏది ఏమైనా కొంతమంది హీరోయిన్లకు పెద్దగా అందం లేకపోయినా, వాళ్లేమి అద్భుతంగా కూడా నటించలేకపోయినా.. అదృష్టం మాత్రం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్లు అయిపోతుంటారు. ఈ లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంటుంది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్.. ఆ మధ్య నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతూ డ్రగ్ కేసులో చిక్కుకుందనే ఆరోపణలు కూడా చాల బలంగా వినిపించాయి. చివరకు ఎలాగోలా ఆ డ్రగ్స్ వివాదం నుండి ఆమె బయట పడింది.