అట్టహాసంగా జరగనున్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్...?

murali krishna
గాడ్‌ఫాదర్‌' సినిమా ప్రచారం ఇంకా షురూ చేయలేదేంటి? అని అభిమానులు గత కొన్ని రోజులుగా తెగ చెవులు కొరుక్కుంటున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఉండి ఉండొచ్చు.


కొందరైతే ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. మరి దీనికి స్పందించో లేక చేయాలనిపించో కానీ.. చిత్రబృందం ప్రచారం షురూ చేసింది. నయనతార పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమా ప్రచారం ఫుల్‌ జోష్‌లో స్టార్ట్‌ చేస్తాం అని కూడా చెప్పారు.


దీంతో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ మీద ఇప్పుడు అందరి దృష్టి పడిందట.దీనికి ఎవరు గెస్ట్‌గా వస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు, ఎంత భారీగా ప్లాన్‌ చేస్తున్నారు, ఏమేం మాట్లాడతారు. చిరు కొత్తగా ఏ లీక్‌లు ఇస్తారు అని లెక్కలేసుకుంటున్నారట.. ఈ క్రమంలో రెండు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఒకటి ఈ ఈవెంట్‌ రెండు చోట్ల నిర్వహిస్తారు అని చెబుతున్నారు. అంటే ముంబయిలో ఒకటి, హైదరాబాద్‌లో మరకొటి ఉంటాయని సమాచారం.ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు.


ఇక రెండోది ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు ముఖ్య అతిథిగా సల్మాన్‌ ఖాన్‌ కూడా వస్తాడని చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల సల్మాన్‌ నుండి చిరంజీవికి భరోసా కూడా వచ్చిందట. అయితే సల్మాన్‌ హాజరు కేవలం ముంబయి ఈవెంట్‌ వరకే ఉంటుందా? లేక హైదరాబాద్‌ ఈవెంట్‌కి కూడా వస్తాడా అనేది తెలియాలి. హైదరాబాద్‌ ఈవెంట్‌కి సల్మాన్‌తోపాటు పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరవుతాడని ఇప్పటికే పుకార్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ఈవెంట్‌ స్టేజీ మీద ఇద్దరు స్టార్లు కాకుండా ముగ్గురు స్టార్లు ఉండబోతున్నారు.


అలాగే సల్మాన్‌ - చిరంజీవితో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను కూడా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి వెంకటేశ్‌ స్పెషల్‌ హోస్ట్‌గా ఉంటారని సమాచారం.. దీంతోపాటు సల్మాన్‌ హైదరాబాద్‌ వచ్చాడంటే చిరు ఇంట్లో పార్టీలే పార్టీలు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్‌ జోష్‌ రావడం ఖాయం. అయితే ఇవన్నీ సినిమా హైప్‌ను పెంచడానికి ఉపయోగపడితే ఇంకా బాగుంటుందని ఎందుకంటే హైప్‌ బాగా తక్కువుంది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: