డైరెక్టర్ గా మారబోతున్న దిల్ రాజు.. హీరో ఎవరంటే..?

Anilkumar
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల జాబితాలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటాడు. అంతేకాదు ఆయన సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ వస్తున్నాడు.ఇక ఆయన కింది స్థాయి నుండి టాలీవుడ్ లో ఎదిగిన వ్యక్తి.అంతేకాకుండా  డిస్ట్రిబ్యూటర్ గా ఒక చిన్న ప్రస్థానం ఆయనది.దిల్ రాజు అంచలంచెలుగా ఎదుగుతూ ఆయన ఇప్పుడు వందల కోట్ల సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే  ఒకేసారి పలువురు సూపర్ స్టార్ల సినిమాలను నిర్మించే స్థాయికి ఆయన వచ్చాడు అంటే ఆయన పడ్డ కష్టం మాత్రమే కాకుండా ప్రతిభ కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాదు ఆయన దర్శకులు మరియు రచయితల నుండి కథలను ఎంపిక చేసుకోవడం మరియు ఆయన సినిమా మేకింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలే ఆయన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చాయి అంటూ ఇండస్ట్రీలో చాలా మంది అంటూ ఉంటారు.ఇకపోతే దిల్ రాజుకి రైటింగ్ పై మంచి పట్టు ఉంది. ఆయన ఆఫీసులో 10 నుండి 15 మంది రైటింగ్ టీం ఉంటారు. ఇక వారికి స్టోరీ లైన్స్ మరియు సన్నివేశాలకు సంబంధించిన లీడ్స్ ఇస్తూ రాయిస్తూ ఉంటాడు.అంతేకాదు  ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వచ్చే దిల్ రాజు తానే స్వయంగా కథా రచయితగా మారెందుకు సిద్ధమైనట్లుగా సమాచారం అందుతుంది.అయితే త్వరలోనే ఒక పూర్తి స్థాయి కథను ఆయన రెడీ చేయబోతున్నాడు.

ఇక  ఇప్పటికే అందుకోసం స్టోరీ లైన్ కూడా సిద్ధంగా ఉంది.. ఆ కథను తానే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.కాగా ప్రముఖ యంగ్ హీరోతో దిల్ రాజు సినిమా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతి త్వరలోనే దిల్ రాజు దర్శకత్వ బాధ్యత వహిస్తే తప్పకుండా మంచి సక్సెస్ లను దక్కించుకునే అవకాశాలు ఉంటాయని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు నిర్మాతలకు కూడా అభిమానులు ఉండడం కేవలం దిల్ రాజు నుండే మొదలు అయ్యింది. కాబట్టి ఆయన దర్శకత్వం వహిస్తే తప్పకుండా సినిమా పాజిటివ్ బజ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: