ఆదిపురుష్: మైండ్ బ్లోయింగ్ రేటుకు తెలుగు రైట్స్?

Purushottham Vinay
ఇక సాహో, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ 'ఆదిపురుష్'.ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'బాహుబలి' సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రభాస్ వరుసగా అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో' సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో దుమ్ములేపింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్లో 'ఆదిపురుష్'  ఒకటి. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్  దర్శకత్వంలో ఈ పౌరాణిక చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది.ఆదిపురుష్ చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.


ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.సీతాదేవిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇంకా రావణుడిగా సైఫ్ అలీఖాన్ అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఇంకా హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నాడు.అయితే ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను యూవీ క్రియేషన్స్ వారు అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏకంగా రూ. 100 కోట్లకు కైవసం చేసుకున్నారట. ఒకవేళ చిత్రానికి మంచి టాక్ వస్తే యూవీ వారికి మంచి లాభాలు వస్తాయని వేరేగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ప్రభాస్ గత చిత్రాలు 'సాహో ', 'రాధేశ్యామ్‌'లకు భారీ నష్టాలొచ్చాయి. ఈ విషయం అందరికీ తలెిసిందే. అయినప్పటికీ కూడా ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని యూవీ క్రియేషన్స్ 'ఆదిపురుష్' చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకోవడం గమనార్హం. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 'ఆదిపురుష్' నిలిచిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: