దేవి శ్రీ ప్రసాద్ తో సీక్రెట్ మ్యారేజ్ పై మొదటిసారి స్పందించిన హీరోయిన్..!!

Anilkumar
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ అందరికి సుపరిచితమే. అయితే ఈయన  ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే  ఈయన పాటల గురించి, మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక సినిమాల పరంగా ఎంత పాపులారిటీని సంపాదించుకున్నాడో వ్యక్తిగతపరంగా అంతేమంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడతో కూడా ఎఫైర్స్ ఉన్నట్టు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.  కాగా నిజానికి నిన్న దేవిశ్రీప్రసాద్ రహస్యంగా పూజిత పొన్నాడని వివాహం చేసుకున్నాడు అనే వార్త మరింత వైరల్ అవుతూ చెక్కర్ లు కొట్టింది.

ఇక దీంతో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది.ఇదిలావుంటే ఇక పూజిత పొన్నాడా ఇటీవల ఆకాశవీధుల్లో అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇక చిన్న సినిమాలలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె నాగార్జున కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత దర్శకుడు, బ్రాండ్ బాబు, రంగస్థలం, ఓదెల రైల్వే స్టేషన్, హ్యాపీ వెడ్డింగ్, సెవెన్, కల్కి వంటి చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం సక్సెస్ ను పొంది సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది.. ఇక ఇదిలా వుండగా ఈ బ్యూటీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తో లవ్ లో ఉన్నట్లు, ఇద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారనే పుకార్లు గట్టిగా వినిపించడంతో ఈ వార్తలను ఖండించింది.

 అయితే ఆమె మాట్లాడుతూ.. నేను దేవిశ్రీప్రసాద్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇక అవి పూర్తిగా పుకార్లు మాత్రమే .. ఎవరో కావాలని ఇలా పుట్టిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.రహస్యంగా వివాహం చేసుకున్నామని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇందులో ఏమాత్రం నిజం లేదు.. నేను ఆయనతోనే కాదు ఎవరితో కూడా రిలేషన్షిప్ మైంటైన్ చేయదలచుకోలేదు.అయితే  నేను సింగిల్ గానే ఉంటున్నాను అంటూ తెలిపింది పూజిత. సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ చూసి చాలా బాధగా ఉంటుందని ఇకనైనా ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటుంది ఈ ముద్దుగుమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: