తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చియాన్ విక్రమ్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగు లో కూడా కొన్ని మూవీ లలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. ఇది ఇలా ఉంటే చియన్ విక్రమ్ తాజాగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 31 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ తమిళ్ తో పాటు ఆగస్టు 31 వ తేదీన తెలుగు లో కూడా విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.
దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు మంచి ఓపెనింగ్ లు లభించాయి. కానీ ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి కలెక్షన్ లు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. మొదటి రోజు కోబ్రా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.28 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు కోబ్రా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు కోబ్రా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా కోబ్రా మూవీ కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి.