రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రభాస్.. సినిమా జోనర్ ఇదే..!!

Anilkumar
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి స్టార్ హీరో అయిన  మహేశ్ బాబు వరకు చాలా మంది హీరోలు నటించారు. అయితే ఇటీవల రాఘవేంద్రరావు నటుడిగా నూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇక 'పెళ్లి సందD' చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో కలిసి రాఘవేంద్రరావు నటించారు. ఇకపోతే  రాఘవేంద్రరావు ప్రజెంట్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో సూపర్ హిట్ ఫిల్మ్స్ చేసిన రాఘవేంద్రరావు.. ప్రభాస్ తో కూడా సినిమా చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక  'అమరజీవి', 'త్రిశూలం', 'బొబ్బిలి బ్రహ్మన్న' వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ ను కృష్ణంరాజుతో తీసిన రాఘవేంద్రరావు.. ప్రభాస్ తో 'భక్త కన్నప్ప' మాదిరి డివోషనల్ ఫిల్మ్ చేస్తానని చెప్పారు.అయితే 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఇమేజ్ చాలా కాలం పాటు అలానే ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రభాస్ తో డివోషనల్ రోల్ చేయిస్తే హిట్ అవుతుందని రాఘవేంద్రరావు తన అభిప్రాయం చెప్పారు. ఇక ప్రభాస్.. 'ఆదిపురుష్' చిత్రంలో రాముడిగా కనిపించనున్నారు.కాగా  రామాయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా 'సీత'గా కృతిసనన్ నటిస్తుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ కోసం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్, ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇకపోతే  ప్రభాస్ గత చిత్రం 'రాధేశ్యామ్' అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఇక  ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి మరి.. ఇక భవిష్యత్తులో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రభాస్ 'భక్త కన్నప్ప' మాదరి చిత్రం చేస్తారో లేదో...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: