పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ హీరో కెరియర్ లో మూడవ మూవీ గా తెరకెక్కింది. రంగ రంగ వైభవంగా మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించాడు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు నుండే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ రోజు థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ జరుపు కున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
రంగ రంగ వైభవంగా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. అలాగే ఈ సినిమా ఇతర ప్రాంతాలలో 1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది. మొత్తంగా ఈ సినిమా 8.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 9 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.