లైగర్ మూవీ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తన మనసులో అనుకున్న ఏమాటను అయినా ధైర్యంగా చెప్పగల సమర్థుడు. ఇండస్ట్రీలోని ప్రముఖుల పై కూడ తమ్మారెడ్డి సెటైర్లు వేయగల సమర్ధుడు. ఈమధ్య విడుదలై ఘోరమైన ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న ‘లైగర్’ మూవీ పై తమ్మారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.


పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ మన ప్రవర్తనను బట్టి  ప్రేక్షకుల రియాక్షన్ ఉంటుందని కామెంట్ చేసాడు. అంతేకాదు ‘ఊరికే ఎగిరెగిరి పడటం దేశాన్ని తగలెడతాం ఊరిని తగలెడతాం అంటే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు ఇలాంటివి మనకెందుకు’ అంటూ తమ్మారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఏ హీరో అయినా తాను చాల కష్టపడ్డాను అని చెపితే బాగుంటుంది కాని చిటికెలు వేస్తే ఎవరు ఊరుకుంటారు అంటూ తమ్మారెడ్డి సెటైర్లు వేసారు.



ఇక ‘లైగర్’ ఎందుకు ఫెయిల్ అయింది అన్న విషయమై స్పందిస్తూ ఆసినిమా గురించి తాను ఎక్కువగా మాట్లాడను అనీ వాస్తవానికి తాను ఆసినిమాను చూడలేదు అనీ తనకు ఆ సినిమా చూడాలని కూడ కోరిక లేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి పూరీ జగన్నాథ్ తీసిన సినిమాలలో కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. అయితే ‘లైగర్’ సినిమా వల్ల పూరీజగన్నాథ్ కు వచ్చిన చెడ్డపేరు గతంలో మరే ఫ్లాప్ సినిమా వల్లను వచ్చి ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఇదే సందర్భంలో తమ్మారెడ్డి మరొక ట్విస్ట్ ఇస్తూ ఇండస్ట్రీలో నిర్మాణం అయిన సినిమాలలో 95 శాతం ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాయని కేవలం 5 శాతం మాత్రమే సక్సస్ అవుతాయని కామెంట్ చేసాడు. ఇండస్ట్రీ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందని అవగాహన లేవారు ఎదో ఊహించుకుని మాట్లాడుతూ ఉంటారని సెటైరు వేసారు. ఈమధ్య కాలంలో విడుదలైన ఏసినిమా పైన ‘లైగర్’ పై జరిగినంత నెగిటివ్ ప్రచారం జరగలేదు. ఇలా ఈమూవీ పైనే ఎందుకు జరిగింది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: