ఆ సీన్స్ లైగర్ ఉన్నట్లయితే ఫలితం వేరుగా ఉండేదేమో...?
అటు పూరీ జగన్నాథ్ అభిమానులకు ఇటు విజయ్ దేవరకొండ అభిమానులకు సైతం ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్లను తీసేశారని తెలుస్తోంది. నిడివి ఎక్కువ అవుతుందని భావించి లైగర్ సినిమాలో ఆ సన్నివేశాలను ఎడిటింగ్ సమయంలో తీసేశారని సమాచారం..
డిలీట్ చేసిన సీన్లలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, లైగర్ తండ్రి నేపథ్యం గురించి ఉందని బోగట్టా. అయితే ఆ సీన్లు ఉండి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేవో మైనస్ అయ్యేవో కచ్చితంగా చెప్పలేము. ఇప్పటికీ లైగర్ సినిమాపై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ శ్రద్ధ పెట్టి తెరకెక్కించకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాపైందని చాలామంది కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం విజయ్ దేవరకొండ కెరీర్ కంటే పూరీ జగన్నాథ్ కెరీర్ పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ దర్శకులను గుడ్డిగా నమ్మకుండా కథలపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలు విజయం సాధించని పక్షంలో ఆయన కెరీర్ విషయంలో తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విజయ్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతాయో లేదో క్లారిటీ అయితే రావాల్సి ఉంది.విజయ్ తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో విడుదలైంది లైగర్. కానీ లైగర్ ఫలితం అందరి అంచనాలను అయితే తలకిందులు చేసింది. దీనితో విజయ్ తన తరువాత సినిమాలు హిట్ అయ్యే విధంగా చూసుకుంటున్నాడు..