రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ మూవీ తో దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో మలయాళ క్రేజీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా , రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కే జి ఎఫ్ మూవీ కంటే అదిరి పోయే యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలు అన్నీ కూడా ఒక దానిని మించి ఒకటి ఉండబో తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. చాలా రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ ని నిర్వహించిన సలార్ చిత్ర బృందం ప్రస్తుతం కొన్ని రోజులు రెస్ట్ లో ఉంది.
ఇది ఇలా ఉంటే మళ్లీ ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 2 వ తేదీ నుండి తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సలార్ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.