అందుకే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అయ్యారు: నోయల్

Anilkumar
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇక ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు అగ్ర హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుల నుంచి స్టార్స్ వరకు కూడా అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ అందరితో కలిసి పోతారు.అంతేకాదు అలాగే ఆర్టిస్టులపై వారి అఫెక్షన్ ఎలాంటిదో కూడా బయట పెడుతుంటారు.ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ తాజాగా రాంచరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి నోయల్ మాట్లాడుతూ..

 మగధీర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.కాగా తాను అప్పుడు కీరవాణి దగ్గర పని చేస్తున్నప్పుడు మల్లి గారు తనని రామ్ చరణ్ కి పరిచయం చేశారని తెలిపారు.ఇక  ఇలా పరిచయం చేసిన కొన్ని రోజులకు మగధీర సినిమా ఫైట్స్ సన్నివేశం జరుగుతుండగా అందరితోపాటు తాను కూడా ఫైట్స్ సన్నివేశం చూసానని అయితే ఈ షూట్ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ వెళ్తూ వెళ్తూ నోయల్ బాయ్ అంటూ వెళ్లారు.ఇక ఆ విధంగా రాంచరణ్ నన్ను గుర్తు పెట్టుకొని పలకరించి వెళ్లడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆయన మిమ్మల్ని గుర్తించారు..

మేము ఆయనకి ఎంతో అభిమానులమని చెప్పుకొచ్చారు.రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాగే జరిగిందని రామ్ చరణ్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్ డమ్ పక్కన పెట్టి అందరితో ఎంతో మంచిగా ఉంటారు.ఇక  అందరితో ఎంతో మంచిగా ఉండటంవల్లే ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారని నోయల్ వెల్లడించారు.దీంతో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై నోయల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: