బ్రహ్మస్త్ర : టీం గుండెల్లో భయం.. పోయేట్టు ఉందిగా?

Purushottham Vinay
బ్రహ్మస్త్ర : బాలీవుడ్ లో ఇక ఇటీవల రిలీజ్ అయిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా.. విజయ్ దేవరకొండ లైగర్ చిత్రాలు బోయ్ కట్ దెబ్బకి బలైనవే. వీళ్ళు నోరు జారకపోయుంటే సినిమాకి కనీసం మంచి ఓపెనింగ్స్ అయినా దక్కేవి. అవి కూడా లేకుండా రెండు సినిమాలు నిష్ర్కమించాల్సి వచ్చింది. సినిమాకి మంచి రివ్యూస్ వచ్చినా కానీ కాస్తా..కూస్తో అవి నడివచేవి. ఇక అదీ లేకపోవడంతో పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది.తాజాగా బ్రహ్మస్ర్త సినిమాపై కూడా బోయ్ కట్ ప్రభావం అనేది పడింది. ఇందులో జంటగా నటించిన రణబీర్ కపూర్..అలియాభట్ ఇండస్ర్టీ బిడ్డలు. ఇద్దరు స్టార్ కిడ్స్ . నెపో కిడ్స్ గా ఫేమస్. అందుకే ఇప్పుడు బ్రహ్మాస్ర్తని బోయ్ కట్ చేయాలంటూ కొంత మంది నెటి జనులు సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించడం మరింత వ్యతిరేకతకు దారి తీస్తున్నట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది.'తన సినిమా చూడాలనుకునేవాళ్లు థియేటర్లకు వస్తారని.. మిగతా వాటి గురించి పట్టించుకోనని' హీరోయిన్ అలియా పాత ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యల్ని తవ్వి బటయకు తీస్తున్నారు నెటిజన్లు.

మరొక పాత ఇంటర్వ్యూలో ఆమె ''భారతదేశ అధ్యక్షుడి పేరును గుర్తుంచుకోవలసిన అవసరం లేదని చెప్పింది''. ఇప్పుడీ భామ వీడియోల్ని బాయ్ కాట్ గ్యాంగ్ బయటకు తీసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ నెపొటిజం కారణంగానే ఆత్మహత్యకు చేసుకున్నాడని గతంలో వైరల్ అయిన మీడియా కథనాల్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్ర్తని ఎవరూ చూడవద్దని ప్రేక్షకుల్ని బోయ్ కట్ గ్యాంగ్ అభ్యర్ధిస్తుంది. మరి సినిమాపై ఈ ఎఫెక్ట్ ఎంత వరకూ పడుతుందో చూడాలి. సెప్టెంబర్ 9న బ్రహ్మాస్ర్త సినిమా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: