కోబ్రా: సూపర్.. ఆకట్టుకునే అంశాలు ఇవే?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా డైరెక్టర్ అజయ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కోబ్రా., శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి తదితరులు నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎన్నో వాయిదాల తరువాత విడుదల అయ్యింది.ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ పై ఎన్ వి ప్రసాద్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.అలాగే భువన్ శ్రీనివాసన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈరోజు ఈ మూవీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.. అంతేకాకుండా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ కు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ఇచ్చిందో తెలుసుకుందాం.విక్రమ్ ఎప్పటిలాగే తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఫిదా చేశాడు. పైగా సినిమాలో తన కష్టం బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క గెటప్ తో విక్రం అదరగొట్టాడు.అంతేకాకుండా తన ఎక్స్ప్రెషన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. 



మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి నటనతోనే మంచి మార్కులు సంపాదించుకున్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా తన పాత్రతో బాగా ఆకట్టుకుంది. ఇతర నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.ఇక ఈ సినిమాకు డైరెక్టర్ మంచి కథను అందించాడు.సినిమాటోగ్రఫీ  అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఏ ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక సాంకేతికపరంగా కూడా సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఎంచుకున్న కథ చాలా అద్భుతంగా ఉంది.ముఖ్యంగా లెక్కలతో సినిమాను నడిపించడం చాలా అద్భుతంగా ఉంది. పైగా లెక్కలతోనే సవాళ్లు పరిష్కరించడం కూడా పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. కథనం కూడా అద్భుతంగా ఉంది. సవాల్ విసిరే సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.డిఫరెంట్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: