రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ లో కూడా నటించడానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే స్పిరిట్ మూవీ కంటే ముందే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికే అతి కొద్దీ మంది సభ్యుల మధ్య ప్రభాస్ , మారుతి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మారుతి , ప్రభాస్ హీరోగా తేరకెక్కించబోయే మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ని పెట్టే ఉద్దేశం లో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజా డీలక్స్ అనేది ఒక థియేటర్ పేరు గాను , ఆ థియేటర్ చుట్టూ హారర్ కామెడీ నేపథ్యంలో మారుతి జ్ ప్రభాస్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.
అలాగే ఈ మూవీ కథ తాతా మరియు మనవడు రెండు పాత్రల ఆధారంగా నడుస్తుంది అని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మారుతి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న మూవీ ల రీతిలోనే తక్కువ బడ్జెట్ లోనే ప్రభాస్ మూవీ ని కూడా ఫినిష్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తక్కువ రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు.