గ్రీన్ డ్రెస్సులో మెరిసిపోతున్న నివేద పేతురాజ్..!!

Divya
తెలుగు సినిమా ప్రేక్షకులకు మెంటల్ మదిలో సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పరిచయమయ్యింది ముద్దుగుమ్మ నివేద పేతురాజ్. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి కమర్షియల్ గా ఏ సినిమా కూడా అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం సక్సెస్ కోసం పలు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇప్పటికీ ఈ అమ్మడి చేతిలో రెండు మూడు బడా సినిమాలు ఉన్నట్టు సమాచారం. ఇక ఈ అమ్మడు సినిమాలో కాస్త పద్ధతిగా నటించిన సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. హీరోయిన్ల వరస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజులలో మరిన్ని మంచి పాత్రలు చేయాలని అభిమానుల సైతం కోరుకుంటూ ఉన్నారు.
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఈమె ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు తాజాగా గ్రీన్ డ్రెస్సులో తన అందాలను ప్రదర్శించింది నివేద. ఎక్స్పోజింగ్ చేయకుండానే తన మత్తు కళ్ళతో ప్రేక్షకులను కుర్రకారులను మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్తో కలిసి అలా వైకుంఠపురం సినిమాల కీలకమైన పాత్రలో నటించింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసి రాలేదు.

ఇక  చిత్రలహరి సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. నటిగా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అందాల ఆరబోత ఇలాగే కంటిన్యూ చేస్తే సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మకు పలు అవకాశాలు వెల్లుబడతాయని అభిమానుల సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజులలో అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ హద్దులను చెరిపేస్తుందేమో చూడాలి మరి. ఇప్పుడున్న పరిస్థితులలో యువ హీరోయిన్లు సైతం అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: