రవితేజ కొత్త సినిమా.. వరుసగా నాలుగోది!!

P.Nishanth Kumar
మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలు ప్రతి ఒక్కటి కూడా ఫ్లాప్ అవుతూ ఉన్నా కూడా ఆయన ఒప్పుకునే సినిమాలు లెక్క మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఆయన రూపొందించవలసిన మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు మరొక సినిమా కూడా ఆయన హీరోగా అనౌన్స్ అవ్వబోతూ ఉండడం ఆయన అభిమానులు ఎంతగానో సంతోష పెడుతుంది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు రెండు కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరిచాయి. దాంతో ఈసారి రాబోయే చిత్రాలు తప్పకుండా ప్రేక్షకులను అలరించాలని అందరూ ఆశిస్తున్నారు.

 దానికి తగ్గట్లుగానే వెరైటీ కథనాలు ఉన్న సినిమాలు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన ధమాకా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ సినిమాను విడుదల చేయబోతున్నాడు. రావణాసుర చిత్రాన్ని కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం చేస్తున్నారు. ఆ విధంగా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ ఇప్పుడు నాలుగో సినిమా ను కూడా ఒప్పుకోవడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే విషయం. 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కథా చర్చలు ముగిసాయి. ఈ దర్శకుడికి రవితేజ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో అన్నది చూడాలి. రవితేజ షెడ్యూల్ ను బట్టి వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి లో తెరకెక్కుతుందో చూడాలి. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరించాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించే అయన దర్శకత్వం ఎలా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: