'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ నుండి మరో సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో రాజావారు రాణి గారు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
 

ఆ తర్వాత శ్రీధర్ గాడే దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ తో ఈ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం వరుసగా సెబాస్టియన్ , సమ్మతమే సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీకి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫేమ్ శ్రీధర్ గాడే దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాను సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పాటలను విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ని ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 'అటంటి ఈటంటి' అని సాగే మాస్ లిరికల్ సాంగ్ ని ఆగస్టు 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: