టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి కూడా చాలా దారుణంగా నెగటివ్ స్పందన లభిస్తుంది. సినిమా అసలు ఏమాత్రం బాలేదని జనాలు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మీద కాస్తో కూస్తో కోపం ఉన్న సెలబ్రిటీలు కూడా తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే జబర్దస్త్ షో యాంకర్ అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినట్టు చెబుతున్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె విజయ్ దేవరకొండ పేరు గాని లైగర్ సినిమా పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు కానీ గతంలో వారిద్దరికీ జరిగిన వాగ్వాదాల నేపథ్యంలో ఆమె విజయ్ దేవరకొండ గురించే కామెంట్ చేసింది అనే వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డి కూడా పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.''తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వడం లేదు, అని బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా? అంటూ కామెంట్ చేశారు.
గతంలో పూరి .. మహేష్ బాబు హిట్స్ కొట్టిన డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తారని ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్లకు ఆయన అవకాశాలు ఇవ్వరు అంటూ పనికిమాలిన కామెంట్లు చేశాడు. వాటిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఆయనకు ఇప్పుడు ఘాటు కౌంటర్ ఇచ్చింది.అంతేగాక ''లైగర్ కి ముందు లైగర్ తర్వాత అంట, అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ ఉన్నోడికి హైప్ అవసరం లేదు, లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం'' అంటూ కార్తికేయ 2 సినిమాని లైగర్ సినిమాతో పోలుస్తూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి ఈ కామెంట్ల మీద పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తున్నారు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ అభిమానులు.అయితే మహేష్ అభిమానులు మాత్రం శ్రీ రెడ్డీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక శ్రీ రెడ్డి విజయ్ దేవరకొండ,పూరి జగన్నాథ్ లైగర్ సినిమా గురించి చేసిన కామెంట్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.