టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అక్కినేని నాగార్జున ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున మూవీ లలో నటిస్తూనే టీవీ షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం నాగార్జున తెలుగు ప్రముఖ రియాలిటీ షో లో ఒకటి అయిన బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు . ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకోగా , అందులో మూడు సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు .
అలాగే బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు . మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 4 వ తేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ 6 కోసం నాగార్జున తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత సీజన్ కి నాగార్జున 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా , ఈ సీజన్ కి మూడు కోట్ల రెమ్యూనరేషన్ ను పెంచి 15 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.