ధమాకా చిత్రం నుంచి.. అదిరిపోయే అప్డేట్..!!
ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీలా నటిస్తున్నది ఇందులో ఫస్ట్ సాంగ్ జింతాక్ పోస్టర్తో మరింత ఆసక్తిని రేపింది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో మేకర్స్ లిరికల్ వీడియో సాంగ్ తో మరింత ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇక అందుకు సంబంధించి రాజాగా ఒక అప్డేట్ ను కూడా విడుదల చేశారు. జింతాక జింతాక అంటే సాగే లిరికల్ వీడియో సాంగ్ ని ఈ రోజున చిత్ర బృందం విడుదల చేశారు. ఈ పాటకు సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించారు.
ఈ సినిమాకి శేఖర్ డ్యాన్స్ కంపోజ్ చేసి ఈ పాటని మంగ్లీ అలరించారు. రాములో రాములో అంటూ జానపద గీతాన్ని దూరమా సాంగ్ చేసింది.. ఇప్పుడు ధమాకా కోసం జింతాక్ సాంగ్ ని అందించడం విశేషం. ఇక ఊర మాసుగా ఈ పాటని తెరకెక్కించడం జరిగినట్లు సమాచారం. మాస్ స్టెప్పులతో, రవితేజ శ్రీ లీలా ఈ పాటకి అద్భుతంగా డాన్స్ వేశారని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో కూడా ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అదిరిపోయిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.