తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలకు దూరమై నిర్మాతగా మారిపోయారు.ఇకపోతే ఇలా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి హీరోయిన్ గా ఈమె నటించకపోయిన పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్నారు. అయితే ఇక ఈమె తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో ప్రత్యేక పాటలలో కూడా సందడి చేశారు.
ఇక ఇలా దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న చార్మి ఇండస్ట్రీలో ఉంటూ భారీగానే సంపాదించినట్టు తెలుస్తోంది. పోతే ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్లో గచ్చబౌలి ప్రాంతంలో గోల్డ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ లోనూ ఫ్లాట్ కొనుగోలు చేసింది.ఇక అదేవిధంగా ముంబైలో కూడా రెండు ఫ్లాట్లు కొనుగోలు చేశారని సమాచారం.పోతే ఈమె గ్యారేజ్ లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నట్టు తెలుస్తుంది.కాగా కొన్ని వందల కోట్ల రూపాయల విలువచేసే ఖరీదైన కార్లు చార్మి గ్యారేజ్ లో కనపడతాయి. పోతే చార్మి హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేది.
అయితే ఇక ప్రస్తుతం నిర్మాతగా పూరి జగన్నాథ్ తో కలిసి భాగస్వామ్యం కావడంతో ఈమె కూడా రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాలలో కూడా వాటాలు తీసుకుంటున్నారు.ఇక ఇలా నిర్మాతగా నటిగా ఈ రెండు దశాబ్దాల కాలంలో భారీగానే ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా 2019 లెక్కల ప్రకారం ఆమె నెట్ విలువ ఏకంగా రెండు మిలియన్ డాలర్ల వరకు ఉందట. అయితే ఇక ఈ విలువ ఇప్పటికి మరింత పెరిగి ఉంటుందని తెలుస్తోంది.పోతే ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం..!!