విడాకులకు సిద్ధమైన రంభ.. కానీ ఆ డైరెక్టర్ చెప్పడంతో?
అయితే ఒకప్పటి టాప్ హీరోయిన్ రంభ కూడా భర్తతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందట. కాక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది రంభ. తన అందం అభినయంతో ప్రేక్షకుల మతి పోగొట్టింది అని చెప్పాలి. స్టార్ హీరోలందరితో కూడా సినిమాలు చేసింది.సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. ఇక ఇండస్ట్రీలో కాస్త అవకాశాలు తగ్గుతున్న సమయంలో కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న వీరీ దాంపత్య జీవితంలో కొన్ని మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది.
అయితే విడాకుల కోసం రంభ ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించిందట. ఇక ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేసి భరణం కింద ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిందట. ఇక వీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలియగానే ప్రముఖ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రంగంలోకి దిగి వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. భార్య భర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు సర్వసాధారణమని.. విడాకుల వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందని చెప్పడంతో ఇక రంభ విడాకుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుందట. తద్వారా వీరి వైవాహిక జీవితం నిలబడిందని తెలుస్తోంది.