'మాచర్ల నియోజకవర్గం' ఓటీటీ రిలీజ్.. మరీ ఇంత తొందరగానా..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో అయిన నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇదిలావుంటే ఇక నితిన్ కి కొంతకాలంగా హిట్టు అనేది లేదు.అయితే  ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఆయన 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేశాడు. కాగా పొలిటికల్ టచ్ తో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.ఇకపోతే సుధాకర్ రెడ్డి - నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు.అయితే  ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేసారు.ఇక ఈ  సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

పోతే  ఈ సినిమాపై అంతటా నెగిటివ్ కామెంట్స్ వినపడ్డాయి.ఇక  రివ్యూలు చాలా దారుణంగా వచ్చాయి. అంతేకాదు పక్కా రొటీన్ మార్క్ ఫిల్మ్ అని తేల్చేసారు. ఇక ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.ఇదిలా వుండగా ఇక మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మరి కొద్ది వారాల్లోనే ఓటిటిలో పలకరించనుంది.అయితే  అమేజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్నారు. కాగా సెప్టెంటబర్ 9న ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ కానుందని తెలుస్తోంది.అయితే  రిలీజైన నాలుగు వారాల్లో ఓటిటిలో వస్తోంది.ఓటిటిలో ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. 

ఈ చిత్రం రిలీజ్ కు ముందు దర్శకుడు రాజశేఖర్ రెడ్డిసోషల్ మీడియాలోవివాదంలో ఇరుక్కుంది.ఇక  దాంతో కొందరు ఈ సినిమా బ్యాన్ చేసారని చెప్తున్నారు. అయితే అందుకే దారుణమైన రిజల్ట్ వచ్చిందంటున్నారు. కాగా ఈ దర్శకుడు గతంలో సోషల్ మీడియాలో రెండు కులాలని కించపరుస్తూ చేసిన కొన్ని వివాదాస్పదమైన సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని, కావాలనే తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ కేసు కూడా పెట్టాడు రాజశేఖర్.ఇక  ఈ విషయమై నితిన్ సైతం సోషల్ మీడియాలో చేసాడు. అందరూ రాజశేఖర్ రెడ్డిని తప్పుపడుతున్నారు.ఇకపోతే మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయన్స్ గా కృతి శెట్టి .. కేథరిన్ అలరించనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: