టాలీవుడ్ సమ్మె: ప్రభాస్ కి ఎన్ని కోట్ల నష్టమంటే?

Purushottham Vinay
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయని ఇంకా అలాగే నటీనటులకు అత్యధిక పారితోషికం చెల్లించడం వల్ల నిర్మాతలకు సినిమాలు చేయడం కష్టతరంమం మారడంతో నిర్మాత మండలి సమావేశం అయ్యి కొన్ని రోజులపాటు సినిమా షూటింగ్ లు అనేవి నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఇక ఈ క్రమంలోనే ఒకటవ తేదీ నుంచి కూడా టాలీవుడ్ సినిమాలు నిలిపివేయాలని నిర్ణయం అనేది తీసుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు అనేవి నిలిచిపోవడం వల్ల ఎంతోమంది కార్మికుల కూడా చాలా నష్టపోతున్నారు.ఈ విధంగా అర్థంతరంగా సినిమా షూటింగులు అనేవి ఆగిపోవడంతో కొందరు నిర్మాతలకు చాలా నష్టాలు రావడమే కాకుండా హీరోలు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.ఇక ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి.ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్టుకే ఇంకా సలార్ వంటి సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు.


ఈ రెండు సినిమా షూటింగ్ ల కోసం భారీ సెట్ నిర్మాణం చేశారు. అయితే షూటింగ్ వాయిదా పడటం వల్ల ఈ రెండు షెడ్యూల్ కి కలిపి దాదాపు 30 కోట్ల వరకు కూడా నష్టం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.ఇలా నిర్మాతలకు మాత్రమే కాకుండా హీరో ప్రభాస్ కి కూడా ఈ కాల్ షీట్స్ మిస్ కావటం వల్ల ఏకంగా ఆయనకు ఐదు కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. మొత్తానికి ఈ సమ్మె కారణంగా ప్రభాస్ కి ఐదు కోట్ల రూపాయల నష్టం రావడం అంటే అసలు మామూలు విషయం కాదని చెప్పాలి. ఇప్పటికే సమ్మెలో కొంత మేర సడలింపులు కూడా వచ్చాయి.అసలే ప్రభాస్ సినిమాలు చాలా లేట్ గా రిలీజ్ అవుతుంటాయి.మరి భారీ బడ్జెట్ సినిమాలు ఎప్పుడు తిరిగి షూటింగ్ ప్రారభమవుతాయో ఇంకా తెలియడంతో లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: