శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు ఆయన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఆఖరుగా మహా సముద్రం మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్ , అదితి రావు హైదరి లు హీరోయిన్ లుగా నటించగా , అజయ్ భూపతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన మహా సముద్రం మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. మహా సముద్రం మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా , శ్రీ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ తో శర్వానంద్ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో అమల ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా , ఈ సినిమా బృందం ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: