ఆ సెంటిమెంట్ ను నమ్ముకున్న నిఖిల్ !

Seetha Sailaja

ఒకసినిమా ఒకటికి రెండుసార్లు రకరకాల కారణాలతో విడుదల వాయిదా పడి ఆతరువాత విడుదల అయితే ఆమూవీ పై సగటు ప్రేక్షకులలో క్రేజ్ బాగా తగ్గిపోతుంది. అయితే దీనికి మినహాయింపు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో జరిగింది. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ఎన్నిసార్లు వాయిదా పడినా ఆమూవీ పట్ల క్రేజ్ సగటు ప్రేక్షకులలో మరింత పెరిగింది కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈసూత్రం తన సినిమాలకు కూడ వర్తిస్తుందని యంగ్ హీరో నిఖిల్ భావిస్తున్నాడు.

నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ ఎప్పుడో విడుదల కావలసి ఉంది. అయితే రకరకాల కారణాలతో ఈమూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడింది. చిట్టచివరిగా ఈమూవీ ఆగష్టు 13న విడుదల కాబోతోంది. ఎన్నిసార్లు వాయిదా పడినప్పటికీ తన సినిమాను ఒక సెంటిమెంట్ కాపాడుతుందని నిఖిల్ ఆశపడుతున్నాడు. గతంలో నిఖిల్ కు హిట్స్ ఇచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘అర్జున సురవరం’ మూవీలు అనేకసార్లు వాయిదా పడి రిలీజ్ అయినప్పటికీ ఆ రెండు సినిమాలు నిఖిల్ కు హిట్ గా మారాయి.

అయితే ఈమధ్య కాలంలో నిఖిల్ సినిమాలు అన్నీ వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్తితులలో నిఖిల్ కు ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆకోరిక ‘కార్తికేయ 2’ నెరవేరుస్తుందని నిఖిల్ భావిస్తున్నాడు. దీనికితుడు వచ్చేవారం వీకెండ్ తో పాటు ఆగష్టు 15 సెలవు కూడ కలిసి రావడంతో వరసగా మూడురోజుల సెలవులు రాబోతున్నాయి. దీనితో యూత్ తన సినిమాకు వచ్చితీరుతారు అన్ననమ్మకంతో ఎంత పోటీ ఉన్నప్పటికీ నిఖిల్ తన సినిమాను ఈపోటీ మధ్య విడుదల చేస్తున్నాడు.

ఈమధ్య కాలంలో ప్రేక్షకులు సీక్వెల్ సినిమాలను చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉన్న తన మూవీకి మంచి కలక్షన్స్ వస్తాయని నిఖిల్ భావన. ఈమూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ తనకు సెంటిమెంట్ గా గతంలో బాగా కలిసి వచ్చిన కలర్స్ స్వాతిని ఈమూవీలో ఒక కీలక పాత్రలో నటింప చేస్తూ నిఖిల్ అన్ని సెంటిమెంట్లు పాటిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: