ట్రైలర్: పాయల్ అందాలతో అయినా ఆది హిట్టు కొట్టేనా..?

Divya
ఆది సాయికుమార్ ఇండస్ట్రీలో హీరోగా లేదా కొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భిన్నమైన జొన్నలలో సినిమాలలో నటిస్తు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోతున్నాడు ఆది. అయితే ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలని ఉద్దేశంతోనే తీసి మార్ ఖాన్ అనే సినిమా టైటిల్ తో రాబోతున్నాడు అది. తీస్మార్గం చిత్రానికి కళ్యాణ్ జీ గోగణ డైరెక్షన్ వహించారు. ఇక ఈ సినిమాలో స్టూడెంట్ గా రౌడీగా పోలీస్ ఆఫీసర్గా మూడు పాత్రలలో కనిపించబోతున్నారు ఆది.

ఇందులో ఆర్ఎక్స్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నది ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో.. హీరోయిన్ పూర్ణ, సునీల్ తదితరులు నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంగా థియేటర్ ట్రైలర్ను విడుదల చేసింది. సక్సెస్ కోసం ఆది ఈసారి పక్కా మాస్ కమర్షియల్ సినిమాతో రాబోతున్నట్లుగా ఈ ట్రైలర్ను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే పోలీస్ ఆఫీసర్గా ఈసారి ఆది కాస్త దూకుడు చూపించాడని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ అందచందాలతో కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. మరి ఈమే అందాలతో నైనా ఈ సినిమాకి కలిసొస్తుందేమో చూడాలి. ఆది, పాయల్ మధ్య రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. తీస్ మార్ ఖాన్ అనే  పక్కా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా అలరిస్తుందని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఇక ట్రైలర్ లో కూడా ఆది వన్ మ్యాన్ షో అన్నట్లుగా వ్యవహరించారు. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో నైనా ఆది సక్సెస్ బాట పడతాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: