బింబి సార సినిమా ఎలా ఉందంటే..?

Divya
నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్నో సంవత్సరాల తర్వాత తాజాగా బింబిసార మన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమాతో ఒకప్పుడు హీరోగా నటించిన వసిస్ట్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. ఇక సోషియో ఫాంటసీ బ్యాడ్ గ్రాఫ్ లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పవచ్చు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజున విడుదల అయింది ఈ సినిమాల కేథరిన్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం పై ఈ సినిమాని కళ్యాణ్ రామ్ అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ రివ్యూ ని ఆడియన్స్ తెలియజేయడం జరిగింది వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
క్రీస్తుపూర్వం 500 ఏల క్రితం త్రీగర్తల సామ్రాజ్యం నిధి చుట్టూ తిరుగుతుంది అని.. ఆ సామ్రాజ్యానికి అధిపతి అయిన (రాజు)  బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని ఆడియన్స్ తెలియజేస్తున్నారు. తన సామ్రాజ్య నిధిని కలియుగంలో ఎలా కాపాడుకున్నాడు అనే కదా అంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది అని తెలుపుతున్నారు. ఈ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కూడా తెలియజేస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ గా ఉందని విజువల్ వండర్స్ అదిరిపోయేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ మెస్మరైజింగ్ చేసేలా కనిపిస్తున్నాయని ఎన్టీఆర్ చెప్పినట్లుగానే బింబి సార చిత్రంలో కళ్యాణ్రామ్ తప్ప మరెవరు చేయలేని నటనను ప్రదర్శించారని ఆడియన్స్ తెలుపుతున్నారు ఇక ఈ సినిమా కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో గా మొత్తం తన భుజాలపైనే తీసుకువెళ్లినట్లుగా ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతో డెడికేషన్ తో కళ్యాణ్రామ్ ఈ సినిమాలో యాక్టు చేశారని ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లారని విధంగా ట్యూట్లు చేయడం జరుగుతుంది ఇక ఈ సినిమా మంచి సూపర్ హిట్ విజయాన్ని అందుకుందని కళ్యాణ్ రామ్ కెరియర్లు మరొక హిట్టు పడిందని పోస్ట్ పెడుతున్నారు. ఇక ఈ ఈ చిత్రానికి సాయి ధరంతేజ్, మంచు విష్ణు, సత్యదేవ్ ట్వీట్ రూపంలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: