'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ కథను చెబుతాను అంటే మొదట వినలేదు... శరత్ మండువ..!

Pulgam Srinivas
దర్శకుడు శరత్ మండువ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా, దివ్యాంశ కౌశిక్ , రాజేష విజయన్ లు ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఈ రోజు అనగా జూలై 29 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల సందర్భంగా ఈ చిత్ర బృందంలోని సభ్యులు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ మూవీ కి సంబంధించిన అనేక విషయాలను చెబుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ దర్శకుడు అయిన శరత్ మండువ కూడా ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. వేణు తొట్టెంపూడి దాదాపు పది సంవత్సరాల నుండి ఏ సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శరత్ మండువ,  వేణు తొట్టెంపూడి గురించి మాట్లాడుతూ ... నాకు వేణు గారు అంటే  చాలా ఇష్టం. ఆయన నటన నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆయన సూపర్ గా సెట్ అవుతాడు అని అనిపించింది. కాకపోతే అప్పటికే ఆయన వేణు మూవీ లు మానేసి చాలా కాలమైంది. రామారావు ఆన్ డ్యూటీ మూవీ కథను చెప్పడానికి వేణు గారి దగ్గరికి వెళితే .. నాకు చేసే ఉద్దేశం లేనప్పుడు కథ  వినడం ఎందుకండీ వద్దు అన్నారు. ఒకసారి కథ వినండి ,  ఆ తరువాత మీ ఒపీనియన్ చెప్పండి అన్నాను.  అప్పుడు వేణు కథ విన్నారు. కథ మొత్తం విన్న తరువాత మూవీ చేస్తాను అని చెప్పారు అని తాజా ఇంటర్వ్యూలో శరత్ మండువ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: