నవ్య స్వామికి అది కూడా తెలీదా.. ఎంతటి దౌర్భాగ్యం?

praveen
తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా నవ్య స్వామి గురించి ప్రత్యేకం గా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ లో నటించి తన నటనతో తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నవ్య స్వామి. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై అందానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక నిజజీవితంలో కూడా ఎంతో చలాకీగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల కాలంలో ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో టీం లీడర్ గా కూడా వ్యవహరిస్తుంది అన్న విషయం తెలిసిందే.

 తద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కన్నడ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తమిళంలో కూడా పలు ధారావాహిక లో నటించింది. ఇక ఈ టీవీ లో నా పేరు మీనాక్షి అనే సీరియల్ తో  తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక స్టార్ మా లో ఆమె కథ సీరియల్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇటీవలే నవ్య స్వామి చేసిన కామెంట్స్ అభిమానులందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

  ఇటీవల విడుదలైన ఢీ షో ప్రోమో లో భాగంగా సంక్రాంతి రోజు గాలిపటం ఎందుకు ఎగరవేస్తారు అంటూ అడుగుతాడు  యాంకర్ ప్రదీప్. అయితే ప్రదీప్  ప్రశ్నకు సమాధానం చెప్పిన నవ్య స్వామి.. వెదర్ కొంచెం కోపరేట్ చేస్తుంది కాబట్టి ఇక కైట్ ఎగరవేస్తారు అంటూ సమాధానం చెబుతుంది. ఈ సమాధానం విని అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. దౌర్భాగ్యం కాకపోతే సంక్రాంతికి గాలిపటం ఎందుకు ఎగరేస్తారో కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇక ఇలాంటివి సర్వ సాధారణం అంటూ లైట్  తీసుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: