KGF2 న్యూ రికార్డ్: మళ్ళీ RRRని వెనక్కునెట్టిందిగా!

Purushottham Vinay
KGF2 న్యూ రికార్డ్: ఇక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'కేజీఎఫ్ చాప్టర్-2' సినిమా ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో కూడా ఈ సినిమా వసూళ్ళ వర్షాన్ని కురిపించింది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.1250 కోట్ల కలెక్షన్‌లను సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక కలెక్షన్లలో ఖాన్‌, కపూర్‌లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్ ఇంకా యశ్ నటన అయితే ప్రేక్షకులను ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌లో కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ ఇంకా అలాగే మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.తాజాగా ఈ సినిమా మరో రికార్డుని కూడా సృష్టించింది. అదేంటంటే..PVR స్క్రీన్స్ లో ఈ సినిమా ఏకంగా 124 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా తరువాత స్థానంలో గ్లోబల్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్"  సినిమా 93 కోట్ల వసూళ్లతో రెండవ స్థానంలో ఉంది.


గత శుక్రవారంతో ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో యష్‌కు జోడీగా హాట్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్ ఇంకా అలాగే ప్రకాశ్‌రాజ్‌ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: