నందమూరి మల్టీస్టారర్ పై కళ్యాణ్ రామ్ కామెంట్స్.. అదే సమస్య అంటూ..?

Anilkumar
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి మనకి తెలిసిందే.అయితే ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నందమూరి హీరోల మల్టీస్టారర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇకపోతే మెగా హీరోలు చిరంజీవి, చరణ్ పలు సినిమాలలో కలిసి నటించగా అక్కినేని హీరోల మల్టీస్టారర్ మనం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఇదిలావుంటే విక్టరీ వెంకటేష్, రానా "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. 

ఇక నందమూరి హీరోల మల్టీస్టారర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.కాగా కొన్నేళ్ల క్రితం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎవడు సినిమాలో మొదట ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఎంపికయ్యారు. అయితే  ఇక కొన్ని కారణాల వల్ల తారక్, కళ్యాణ్ రామ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చరణ్, అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే బాలయ్య, కళ్యాణ్ రామ్, తారక్ ఒకే సినిమాలో నటిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.ఇదిలావుంటే కళ్యాణ్ రామ్ బింబిసార ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి మల్టీస్టారర్ గురించి స్పందిస్తూ బాబాయ్,

 తమ్ముడితో మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి నాకు అభ్యంతరం లేదని అయితే అయితే ముగ్గురం కలిసి నటించాలంటే మంచి కథ దొరకాలని తెలిపారు. కాగా స్టార్ డైరెక్టర్లలో ఎవరైనా మంచి కథను సిద్ధం చేస్తే నందమూరి మల్టీస్టారర్ తెరకెక్కడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు.అయితే నందమూరి హీరోలకు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.కాగా  బాలయ్య లేదా తారక్ నందమూరి మల్టీస్టారర్ పై దృష్టి పెడితే నందమూరి మల్టీస్టారర్ ను థియేటర్లలో చూడటానికి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. ఇదిలావుంటే ప్రస్తుతం నందమూరి హీరోలు వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.పోతే  కళ్యాణ్ రామ్ బింబిసారతో సక్సెస్ సాధిస్తారని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: