తెలుగు రాష్ట్రాల్లో 'విక్రాంత్ రోనా' మూవీ కి వస్తున్న రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రేపు అనగా జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.


ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక పోతే ఈ సినిమా రేపే విడుదలకు సిద్ధంగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ టికెట్ లను ఆన్లైన్ బుకింగ్ లో చిత్ర బృందం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆశించిన రీతిలో లేనట్లు తెలుస్తోంది.


దానికి ప్రధాన కారణం విక్రాంత్ రోనా మూవీ జూలై 28 వ తేదీన విడుదల కానుండగా, జూలై 29 వ తేదీన రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల అవుతూ ఉండడం,  రామారావు ఆన్ డ్యూటీ  మూవీ పై కూడా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకొని ఉండడంతో ఎక్కువ శాతం తెలుగు సినీ ప్రేమికులు రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఆసక్తి చూపిస్తూ ఉండడంతో మొదటి రోజు విక్రాంత్ రోనా మూవీ కి పెద్దగా అడ్వాన్స్ బుకింగ్ లు కావడం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.  మరి మొదటి రోజు విక్రాంత్ రోనా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: