టాలీవుడ్ టాప్ హీరోల స్పెషల్ స్టేటస్ పై చర్చలు !

frame టాలీవుడ్ టాప్ హీరోల స్పెషల్ స్టేటస్ పై చర్చలు !

Seetha Sailaja
ప్రస్థుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనేక సమస్యలకు రోజురోజుకు పెరిగిపోతున్న సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ మూలకారణం అంటూ అందరు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే క్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశాలు వరసపెట్టి జరుగుతున్నాయి.

ఈ సమావేశాలలో అనేక అంశాలు చర్చలకు వస్తున్నప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోల భారీ పారితోషికాల గురించి ఏవక్కరు మాట్లాడటానికి సాహసించక పోవడం ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీని శాసిస్తున్న మహేష్ జూనియర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ పారితోషికాల గురించి మాట్లాడకుండా మిగతా బి గ్రేడ్ హీరోలు రవితేజా నాని నాగచైతన్య సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ల పారితోషికాల గురించి మాత్రమే నిర్మాతలు మాట్లాడుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు టాప్ దర్శకులలో రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ సుకుమార్ పారితోషికాలను పక్కకు పెట్టి మిగతా దర్శకుల పారితోషికాల గురించి క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాల గురించి మిగతా హీరోయిన్స్ టాప్ టెక్నిషియన్స్ పారితోషికాల గురించి మాట్లాడుకుంటూ వారందరూ తమ పారితోషికాలను కనీసం 30 శాతం తగ్గించుకాకపోతే ఇక సినిమాలు తీయలేని పరిస్థితి అంటూ కామెంట్స్ కొందరు నిర్మాతలు చేసినట్లు వార్తలు రావడంతో వారంతా టాప్ హీరోలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వాస్తవానికి భారీ సినిమాల బడ్జెట్ లో టాప్ హీరోలకు టాప్ దర్శకులకు ఇచ్చే పారితోషికమే చాల ఎక్కువ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘పుష్ప 2’ కోసం అల్లు అర్జున్ కు 75 కోట్లు సుకుమార్ కు 50 కోట్లు ఇస్తున్నారు అన్న ప్రచారం జరగబోతోంది. ఇలాంటి విషయాలను గురించి మాట్లాడకుండా కేవలం బి గ్రేడ్ హీరోల పారితోషికాల గురించి మాట్లాడకుంటే ఇండస్ట్రీ సమస్యలు తీరిపోతాయా అంటూ కొందరి కామెంట్స్. అయితే ఈ విషయాలను ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలు పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: