
బింబిసారుడి కోసం ఎన్టీఆర్ ఎంట్రీ.. వీడియో వైరల్..!!
ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా బింబిసార వస్తున్నాడు అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో జై లవకుశ సినిమాలోని ఎన్టీఆర్ పోషించిన రావణ్ పాత్రను కట్ చేసి ఈ వీడియోలో మిక్స్ చేసి విడుదల చేశారు. నందమూరి సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మద్య మంచి సన్నిహిత్యం ఉందని విషయం అందరికీ తెలిసిందే ఎల్లప్పుడూ కూడా ఒకరికొకరు సపోర్టుగా నిలుస్తూ ఉంటారు గతంలో కూడా ఎన్నో సినిమా ఫంక్షన్స్ కు తారక్ అతీదిగా వచ్చారు. ఇప్పుడు బింబిసారా సినిమా కోసం తన వంతు సపోర్టు చేయడానికి సిద్ధమయ్యాడు ఎన్టీఆర్.
ఇక బింబి సారా అనేది ఒక టైం ట్రావెల్ సినిమా కావడంతో కళ్యాణ్ రామ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. చారిత్రాక యుగంలో క్రూరమైన బింబిసారుడు గా, సమాజం కోసం పోరాడే ఆధునిక యువకుడు రెండు పాత్రలలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పలు అప్డేట్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక వీరితోపాటే బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.