చిరంజీవి పానీ పూరి హంగామా !
ఈ సాన్నిహిత్యం వల్ల చాలామంది బాలీవుడ్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కు చిరంజీవి సహాయ సహకారాలు కోరుతూ ఉంటారు. తమ సినిమా ఫంక్షన్స్ కు చిరంజీవి అతిధిగా వస్తే ఆయన ఇమేజ్ తో తెలుగు ప్రేక్షకులలోకి చాల సులువుగా వెళ్లిపోవచ్చు అన్నది బాలీవుడ్ టాప్ హీరోల వ్యూహం. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం పరాజయాల బాటలో ఉండటంతో ఈ టాప్ హీరోకు ఒక హిట్ కావాలి.
దీనితో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్ కు రీమేక్‌గా ఈమూవీ తీసారు. ఆగస్టు 11న రాబోతున్న ఈమూవీలో నాగచైతన్య కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వాలని అమీర్ ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం ఈసినిమా ప్రమోషన్ ను చాల పెద్ద స్థాయిలో హైదరాబాద్ లో చేస్తున్నాడు. దీనిలో భాగంగా అమీర్ ఖాన్ చిరంజీవి చైతన్యలతో కలిసి భాగ్యనగరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించాడు.
ఈ సమావేశంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన మీడియా కెమెరాలకు మంచి పని కల్పించింది. అమీర్ ఖాన్ చిరంజీవిలు ఒకే వేదిక పై పానీపూరీ లు ఒకరికొకరు తినిపించుకుంటూ తాము సెలెబ్రెటీలు అయినప్పటికీ తమకు అందరిలాగే కోరికలు ఉంటాయి అన్న విషయాన్ని తెలియచేసారు. అయితే ఈ ఈవెంట్ లో అమీర్ ఖాన్ చిరంజీవిలు ఒకరికొకరు ప్రేమగా పానీ పూరీలు తినిపించుకుంటే నాగచైతన్య మటుకు తనకెవ్వరు తినిపించే వారు లేక తాను ఒక్కడే ఆ పానీ పూరీలు తినడంతో చైతన్య పై సోషల్ మీడియాలో జోక్స్ పడుతున్నాయి..