మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఉండరు.ఇదిలావుంటే ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే. ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనుకోని విధంగా వీరిద్దరూ కలిసి నటించిన ఆచార్య సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడం జరిగింది.
ఇక ప్రస్తుతం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.అంతేకాదు ఈ టీజర్ లో మెగా స్టార్ చిరంజీవి మాస్ లుక్ లో అందరిని తెగ ఆకట్టుకున్నాడు.ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లకు మెగా స్టార్ చిరంజీవి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. . ఇకపోతే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసారు మెగాస్టార్ చిరంజీవి.అయితే ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. షూటింగ్ స్పాట్‌కు వచ్చాక డైరెక్టర్లు డైలాగులు రాసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరు.
అంతేకాదు ఇది నటులకు ఇబ్బందిగా ఉంది.. నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని గుర్తు చేశారు మెగాస్టార్.ఇదిలావుంటే ముందే స్క్రిప్ట్ ఇస్తే ఫెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెడతారు.. టాలీవుడ్ డైరెక్టర్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు చిరంజీవి.కాగా క్లాప్స్, జేజేలు కొట్టే సినిమాలు మాత్రమే చేస్తానన్నారు చిరంజీవి. ఇక అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్ లు నాకు వస్తె నేను చెయ్యనని. అంతేకాకుండా ఏమి చేస్తే క్లాప్ కొడతారు . ఇకపోతే జే జే లు కొడతారు అనేది నేను చూస్తానని వెల్లడించారు.అయితే అప్పుడప్పుడు నా ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయని.కాగా అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టమని తెలిపారు. అయితే అమీర్ ఖాన్ లాగా మేం చేయాలనుకుంటాం, మాకున్న లిమిట్స్ వల్ల చేయలేకపోతున్నామని చెప్పారు. ఇక స్క్రిప్ట్ మీద అవగాహన కోసం వర్క్ షాప్ లు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి...!!